ట్విట్టర్ ఇన్ స్టాలను పర్మినెంట్ గా డిలీట్ చేశాడు!

అశ్లీల చిత్రాల రాకెట్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా అతడు తన ఇన్ స్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతాలను శాశ్వతంగా తొలగించారు. రాజ్ మునుపటి రోజులను పూర్తిగా మర్చిపోయారు. తన భార్య శిల్పతో కలిసి సరదాగా వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు. ఈ వివాదంతో ఇప్పుడు తన రెండు సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం చర్చనీయాంశమైంది. జూలైలో రాజ్ కుంద్రా అశ్లీలత కేసులో అరెస్టయ్యారు. దాదాపు రెండు నెలల జైలు జీవితం తర్వాత విడుదలయ్యాడు. అంతేకాదు అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు.

నిజానికి కోర్టుల కుంద్రా తనను బలిపశువును చేశారని అనుమానాస్పద కంటెంట్ ను రూపొందించడంలో చురుకుగా పాల్గొన్నట్లు అనుబంధ ఛార్జిషీట్ లో ఏ ఒక్క సాక్ష్యం లేదని వాదించారు. దాదాపు నెలపాటు కుంద్రాపై ఆరోపణలు కోర్టు గొడవలతో పూర్తిగా శిల్పాశెట్టి ఆజ్ఞాతంలోనే ఉన్నారు. శిల్పాశెట్టి కుంద్రా నుంచి విడిపోతోందని కూడా ప్రచారమైంది. ఎట్టకేలకు రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలయ్యాక.. ఆయనతో ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోలు వీడియోలను షేర్ చేశారు. శిల్పాశెట్టి ఎట్టకేలకు జనంలోకి వెళుతున్నారు. తన వృత్తి జీవితంలో కూడా తిరిగి బిజీ కానున్నారు. కాలంతో పాటే మరుపు. అన్నీ మర్చిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ఈ జంట ప్రారంభిస్తోందని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం కుంద్రా తన ట్విట్టర్ ఇన్ స్టాలను పర్మినెంట్ గా డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

సాలువా వ్యాపరం నుంచి నీలిచిత్రాల వరకూ..!

ఒక సాధారణ సాలువాల వ్యాపారి నీలిచిత్రాల వ్యాపారిగా మారిన వైనంపై చర్చ అప్పట్లో దేశంలో ప్రకంపనాలు రేపింది. బాలీవుడ్ నిర్మాత .. బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం సంచలనమైంది. అతడిపై పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. హైదరాబాదీ అమ్మాయి.. నటి షెర్లిన్ చోప్రా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం అయ్యాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనంతరం బెయిల్ నిరాకరణ ఎపిసోడ్ల గురించి తెలిసింది.

విచారణ సమయంలో పలువురు నటీమణులు రాజ్ కుంద్రా యాప్ హాట్ షాట్ లకు వ్యతిరేకంగా బహిరంగంగా బయటకు వచ్చారు. దానిపై అశ్లీల చిత్రాలను సృష్టించడం ప్రచురించడంపై అభియోగాలు మోపబడ్డాయి. షెర్లిన్ చోప్రా అతనిపై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేశారు. ఇక రాజ్ కుంద్రా యాప్ వీడియోల బిజినెస్ పైనా షెర్లీన్ తీవ్ర ఆరోపణలు చేసారు. అశ్లీల కేసుకు సంబంధించి తన స్టేట్మెంట్ ను ముంబై పోలీసులు రికార్డ్ చేశారు.

లైంగిక వేధింపుల కేసులో ఆమె 2021 ఏప్రిల్ లో రాజ్ పై ఎఫ్.ఐ.ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన ఫిర్యాదులో షెర్లిన్ 2019 ప్రారంభంలో రాజ్ కుంద్రా బిజినెస్ మేనేజర్ తనను పిలిచి వీడియోల వ్యాపారం గురించి చెప్పారని తెలిపారు. షెర్లిన్ తర్వాత చాలా మంది సెలబ్రిటీ గాళ్స్ తమతో నీలి చిత్రాలు తీసేందుకు రాజ్ కుంద్రా టీమ్ ఒప్పందాలు చేసుకుందని వెల్లడించడంతో కేసు ఝటిలమైంది.


Recent Random Post: