ఆ విషయంలో ఆర్ఆర్ఆర్‌ ను క్రాక్‌ చేసిన ‘పుష్ప’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందటూ సమాచారం అందుతోంది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా ఆగిపోయింది. అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు కూడా ఐసోలేషన్‌ కు వెళ్లి పోయారు. కరోనా వల్ల పుష్ప సినిమా ఆలస్యం అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటు ఈ సినిమాను ఖచ్చితంగా ఆగస్టులోనే విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏంటో తాజాగా ఆర్ఆర్ఆర్‌ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా తేలిపోయింది.

పుష్ప సినిమా లోని బన్నీ లుక్ ను పరిచయం చేసేందుకు విడుదల చేసిన వీడియో కేవలం 19 రోజుల్లో ఏకంగా 50 మిలియన్ ల వ్యూస్‌ ను దక్కించుకుంది. ఆర్ఆర్‌ఆర్ సినిమాలో చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల లుక్‌ పరిచయం చేస్తూ వచ్చిన వీడియోలను మించి పుష్ప వీడియో వ్యూస్ దక్కించుకుంది. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ వీడియో మాత్రమే 50 మిలియన్ ల క్లబ్‌ లో చేరింది. అది కూడా దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. ఇక గత ఏడాది వచ్చిన రామరాజు వీడియో ఇంకా 50 మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకోలేదు. దీన్ని బట్టి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలను మించి పుష్పకు రేంజ్ ఉందంటూ అల్లు అర్జున్‌ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: