పుష్ప 2022కు జంప్ అయినట్లేనా?

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13నే విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఆ డేట్ కు ఆర్ ఆర్ ఆర్ వస్తుందా అన్నది ఇంకా అనుమానమే అయినా ప్రస్తుతానికి ఈ టీమ్ ఈ డేట్ కే స్టిక్ అయింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ లో రాకపోతే ఆ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుందామని పుష్ప టీమ్ భావించింది.

అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ వస్తే డిసెంబర్ లో పుష్ప విడుదల చేయొచ్చు అన్న ఊహాగానాలు వచ్చాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. పుష్ప చిత్రం ఇంకా 45 రోజుల పాటు షూటింగ్ చేసుకోవాలి. అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయినా కానీ డిసెంబర్ లో పుష్పను చేయట్లేదట. కచ్చితంగా ఈ చిత్రం 2022కు షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. 2022 ఫస్ట్ హాఫ్ లో పుష్ప వస్తుందిట.


Recent Random Post: