లైగర్ తర్వాత పూరి సినిమా కన్ఫర్మ్ అయ్యిందా?

దర్శకుడిగా పూరి జగన్నాథ్ శైలి పూర్తిగా భిన్నమైనది. అతను డిజైన్ చేసే హీరోల్లో ఒక రకమైన నిర్లక్ష్యం ఉంటుంది. అయితే పూరి హీరోయిజం ఎలివేషన్లలో, హీరో పాత్రను సరికొత్తగా డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. గత కొంత కాలంగా ప్లాపులతో బాగా ఇబ్బంది పడ్డ పూరికు 2019లో ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ విజయం దక్కింది. అదే ఊపులో పూరి విజయ్ దేవరకొండతో సినిమాను పట్టాలెక్కించాడు.

కరోనా కారణంగా ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆలస్యమైంది. ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈరోజు ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ తన తర్వాతి ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం అందుతోంది.

సీనియర్ హీరో అక్కినేని నాగార్జునతో పూరి జగన్నాథ్ పనిచేయబోతున్నాడట. పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్ లో సూపర్, శివమణి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు అన్నమాట.


Recent Random Post: