పునీత్ మరణాన్ని వాడుకుంటున్న ఆస్పత్రులు.. దీపావళి విషెస్ వీడియో వైరల్

కన్నడ పవర్ స్టార్ కన్నడ కంఠీరవ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు సెలబ్రెటీలు జీర్ణించుకోవడం లేదు. ఆయన కుటుంబసభ్యులు అభిమానులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

టాలీవుడ్ నుంచి చిరంజీవి బాలక్రిష్ణ వెంకటేశ్ నాగార్జున రాంచరణ్ వంటి టాలీవుడ్ సెలబ్రెటీలు పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇప్పటివరకూ చాలా మందికి తెలియదు. ఆయన గురించి తెలుసుకున్న ప్రజలంతా ఎమోషనల్ అవుతున్నారు.

దీపావళి పండుగ పూట పునీత్ ను తలుచుకొని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని దేవుడికి జాలి లేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ దీపావళికి కన్నడ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో పునీత్ దీపావళికి కాకర్స్ కాల్చడం కాదు.. కేలరీలు బర్న్ చేద్దాం అంటూ ఫిట్ నెస్ ఎక్సర్ సైజులపై హితబోధ చేశాడు.ఇప్పుడు అదే ఫిట్ నెస్ చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారని అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.

-పునీత్ మరణంపై ఆస్పత్రుల దారుణం
పునీత్ మరణాన్ని కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? పునీత్ ఎందుకు చనిపోయాడు? ఎలా వ్యవహరించాలని పునీత్ ఫొటోతో కొన్ని ఆస్పత్రులను ప్రజలను ఆస్పత్రులకు రప్పించేలా ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది. ఆస్పత్రులు రాబంధులను మించిపోయాయని.. పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకుంటున్నాయని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.


Recent Random Post: