హీరోయిన్ ని ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే నటిస్తానన్న యువ నిర్మాత

టాలీవుడ్ లో ఇప్పుడున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు దాని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు స్టార్ హీరోలతో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్తవారికి అవకాశం ఇస్తూ మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ పేరు మీదుగా నడిచే సితార బ్యానర్ లో ఇప్పుడు పలు క్రేజీ చిత్రాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. వాటిల్లో ముందుగా ‘డీజే టిల్లు’ – ‘భీమ్లా నాయక్’ వంటి రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీజే టిల్లు’. బుధవారం హైదరాబాద్ లో మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ‘భీమ్లా నాయక్’ విడుదల గురించి ప్రశ్నించగా.. ”మొన్న పోస్టర్స్ లో చెప్పాం కదా.. ఈ నెల 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ అవుతుందని. మీరు సీఎం జగన్ గారిని అడగాలి.. 50 శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడు సినిమా రిలీజ్” అని నాగవంశీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ‘డీజే టిల్లు’ నాగవంశీ బయోపిక్ అయితే కాదు కదా? ఎందుకంటే క్యారక్టరైజేషన్ అలానే కనిపిస్తుంది అని ఓ విలేఖరి నిర్మాతను ప్రశ్నించారు. దీనికి నాగవంశీ స్పందిస్తూ ”పర్లేదు.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనం కూడా యాక్ట్ చేస్తాం. తప్పేముంది” అని సిగ్గు పడుతూ జవాబిచ్చారు. వెనకున్న హీరోయిన్ నేహా శెట్టి – సిద్ధు జొన్నలగడ్డ కూడా దీనికి నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇదే ఇంటర్వ్యూలో మరో జర్నలిస్ట్ హీరోయిన్ పుట్టుమచ్చల గురించి హీరోని ప్రశ్నించడం.. దీనిపై నేహా స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా ‘సార్’ అనే ద్విభాషా సినిమా తెరకెక్కుతోంది. అలానే తమ బ్యానర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన ‘జెర్సీ’ చిత్రాన్ని మరికొందరు నిర్మాతలతో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక మలయాళంలో ఘన విజయం సాధించిన ‘కప్పెల’ తెలుగు రీమేక్ కూడా సితార బ్యానర్ లోనే రూపొందనుంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.


Recent Random Post: