ఆ పని చేసినందుకు సిగ్గు పడుతున్నా – ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా బ్యూటీ ప్రొడక్ట్స్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. తాను గతంలో అందంగా ఉండేందుకు చాలా క్రీములు వాడేదాన్ని. చిన్నతనంలో చామనచాయగా ఉన్న నేను తెల్లగా అవ్వడానికి కారణం ఆ బ్యూటీ క్రీమ్స్ అనుకున్నాను. అందుకే గతంలో నేను చాలా బ్యూటీ క్రీమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించాను. కాని ఇప్పుడు ఆ పని చేసినందుకు సిగ్గు పడుతున్నాను. గతంలో తాను ఆ పని ఎందుకు చేశానా అంటూ ఇప్పుడు పశ్చాతాప పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఆసియాలో ముఖ్యంగా ఆడవారు అందంగా కనిపించేందుకు బ్యూటీ క్రీమ్స్‌ వాడతారు. కాని ఆ విషయం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందంగా కనిపించాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈమద్య కాలంలో పలువురు స్టార్స్ కూడా బ్యూటీ క్రీమ్స్‌ కు అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుపు ఉంటేనే అందంగా ఉన్నట్లుగా భావించడం సభబు కాదు అంటూ ఈమద్య ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రియాంక చోప్రా అప్పట్లో నటించినందుకు పశ్చాతప పడుతున్నట్లుగా పేర్కొంది.


Recent Random Post: