నిక్ భార్య అనే అంటారా ఇంకా? మీడియాకు పీసీ కోటింగ్!!

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నటించిన `ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్` డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. కోవిడ్ విలయం అనంతరం ఈ సంవత్సరంలోనే హాలీవుడ్ లో అతిపెద్ద చిత్రాలలో ఒకటైన ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. తన సినిమాను ప్రమోట్ చేస్తూ పీసీ ఫుల్ బిజీగా ఉంది. హాలీవుడ్ లో చోప్రా తుఫాన్ కొనసాగుతోంది.

ప్రమోషన్ వేళ పీసీ ఇచ్చిన సడెన్ షాక్ ఊహించనిది. తనని మ్యాట్రిక్స్ ప్రమోషన్స్ సందర్భంగా `నిక్ జోనాస్ భార్య` అని మీడియా పేర్కొనడం షాక్ కి గురి చేసిందిట. దీనిపై ప్రియాంక సీరియస్ అయ్యింది.

`నిక్ జోనాస్ భార్య` అని ప్రస్థావించిన మీడియా కవరేజీ నుండి స్క్రీన్ షాట్ లను పంచుకుంటూ.. ప్రియాంక తన అసహనం వ్యక్తం చేస్తూ… ఇంకా మహిళలు ఇప్పటికీ ఇలాంటి స్త్రీద్వేషాన్ని ఎదుర్కోవలసి వస్తోందని అసంతృప్తిని వ్యక్తపరిచారు పీసీ.

నేను ఎప్పటికప్పుడు అత్యంత పాపులర్ మూవీ ఫ్రాంచైజీలలో ఒకదానిని ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పటికీ `ది వైఫ్ ఆఫ్…` అని నన్ను నా పేరును సూచించటం చాలా ఆసక్తికరం.. కానీ..ఇది సరికాదు!“ అంటూ అసహనం వ్యక్తం చేసింది. “మహిళలకే ఇలా ఎలా జరుగుతుందో దయచేసి వివరించండి? నేను నా బయోకు నా IDMB లింక్ ని జోడించాలా?“ అని ప్రశ్నించింది.

మహిళలు దీని ద్వారా పురోగతి వైపు వెళ్ళవలసి రావడం నమ్మశక్యం కానే కాదని చోప్రా పేర్కొంది. ప్రియాంక తన కథలో నిక్ జోనాస్ ను కూడా ట్యాగ్ చేసింది. జోనాస్ బ్రదర్స్ .. అలాగే తన భర్త నిక్ జోనాస్.. ఇంతకుముందు తన పనిని ఎంత గా మెచ్చుకుంటున్నారో వెల్లడించింది. తన భర్త ఎంత గర్వంగా ఉన్నాడో పరిగణనలోకి తీసుకోవాలని పీసీ కోరింది. ఓవరాల్ గా పీసీ తనని రికగ్నజ్ చేయని మీడియాలపై విరుచుకుపడింది.

ప్రియాంక ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్ పనుల్లో ఇటీవల బిజీగా ఉంది. కీను రీవ్స్- క్యారీ-అన్నే మోస్- నీల్ పాట్రిక్ హారిస్- జెస్సికా హెన్విక్- యాహ్యా అబ్దుల్-మతీన్ II- జోనాథన్ గ్రోఫ్- జాడా పింకెట్ స్మిత్ వంటి స్టార్లతో కలిసి ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటించారు.

ఈ చిత్రానికి లానా వాచోవ్స్కీ దర్శకత్వం వహించారు. మునుపటి ఫ్రాంచైజీ చిత్రాలలో చిన్నతనంలో పరిచయం అయిన సతి అనే పాత్రలో చోప్రా నటించింది. మ్యాట్రిక్స్ ని డిసెంబర్ 22న థియేటర్లతో పాటు స్ట్రీమింగ్ వేదికలలోనూ విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది.


Recent Random Post: