‘మా’ పోటీదారుల్లో మెగా మద్దతు ఎవరికి?

మా అధ్యక్ష పదవి కోసం మంచు వారి అబ్బాయి మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు పోటీ పడబోతున్నారు. అందుకు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది. గతంలో ఎప్పుడు లేనంత రసవత్తరంగా పోటీ ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. మా పోటీదారులు అయిన విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్‌ ల్లో ఎవరికి ఎవరు మద్దతు తెలుపుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానికుడు అయిన మంచు విష్ణు కు మెగా వారి మద్దతు ఉంటుందా లేదంటే ప్రకాష్ రాజ్‌ కు మద్దతును తెలుపే అవకాశం ఉందా అనేది చూడాలి.

గత ఎన్నిల్లో మెగా వారి మద్దతుతోనే అధ్యక్షుడు గెలిచాడు. కనుక ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం ఎవరికి అనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటీ అంటే ప్రకాష్ రాజ్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక మంచు విష్ణు తండ్రి మోహన్‌ బాబుతో స్నేహం ఉంది. ఇటీవలే చిరంజీవి ని మంచు విష్ణు కలవడం జరిగింది. అందుకు సంబంధించిన విషయాలు బయటకు రాలేదు కాని మా ఎన్నికల్లో మద్దతు కావాలని కోరినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి మా పోటీదారులు ఇద్దరు కూడా మెగా కాంపౌండ్ కు సన్నిహితులే అవ్వడం వల్ల ఎన్నికల్లో మెగా మద్దతు ఎవరికి అనేది తెలియాల్సి ఉంది.


Recent Random Post: