ప్రభాస్ ను ఫుల్ గా వాడేయనున్న ప్రశాంత్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో మరింతగా పాన్ ఇండియా స్టార్ డంను దక్కించుకున్న విషయం తెల్సిందే. రియల్ పాన్ ఇండియా స్టార్ ను సరిగ్గా ఉపయోగిస్తే బాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల కంటే రెట్టింపు వసూళ్లను దక్కించుకునే సినిమాలను తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తో ఊర మాస్ గా ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

సలార్ సినిమా లో ప్రభాస్ రెండు రోల్స్ లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. రెండు రోల్స్ లో సీనియర్ ప్రభాస్ రోల్ మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఆ పాత్ర మాస్ అనే పేరుకు అర్థం అన్నట్లుగా ముందు ముందు మాట్లాడుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రభాస్ మరో లెవల్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. అభిమానులు కూడా కేజీఎఫ్ దర్శకుడు అనగానే సలార్ పై ఎక్కువ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్.. సలార్.. ఆదిపురుష్ సినిమాల్లో ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ సలార్ పై నే ఎక్కువ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్బుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హైట్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ కు మాస్ పాత్రలు ఏ రేంజ్ లో సెట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభాస్ తో అద్బుతమైన మాస్ పాత్రను క్రియేట్ చేస్తున్నాడు. ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ను పూర్తిగా వినియోగించుకుంటూ సలార్ ను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సలార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్ వల్ల షూటింగ్ నిలిచి పోయింది. మరి సినిమా విడుదల విషయంలో ఏమైనా మార్పులు వచ్చేనా అనేది చూడాలి.


Recent Random Post: