విపరీతంగా మద్యం సేవించేదాన్ని.. మానేయడానికి పోరాటమే

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్ భట్‌ కూతురు పూజా భట్ హీరోయిన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె తండ్రి దర్శకత్వంలో నటించిన దిల్‌ హై కి మంతా నహీన్‌ సినిమాను చేసింది. ఆ సినిమా విడుదల అయ్యి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమీర్ ఖాన్‌ హీరోగా ఆ సినిమాలో నటించాడు. ఆ సినిమా మూడు దశాబ్దాలు పూర్తి అయిన సందర్బంగా పూజా భట్‌ సోషల్‌ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ఆ సినిమాలో తాగుడుకు బానిస అయిన ఒక తండ్రిని ఆమె దాని నుండి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

నిజ జీవితంలో మాత్రం తానే తాగుడుకు బానిస అయ్యాను. దాని నుండి నాలుగు సంవత్సరాల క్రితమే బయటకు వచ్చాను. సుదీర్ఘ కాలపై తాగుడు అలవాటును మానేయడానికి ఒక పోరాటమే చేశాను. నేను తాగుడు మానేస్తానా అనే అనుమానం కొన్ని సార్లు కలిగింది. కాని నేను పట్టుదలతో తాగుడు మానేసేందుకు పోరాటం చేసి చివరకు సఫలం అయ్యాను అంది. మద్యం నుండి నా ఆలోచన బయటకు తీసుకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇలాంటి విషయాలు ఆడవారు బయటకు చెప్పరు. కాని ఇలా ఎంతో మంది మద్యంకు బానిస అయ్యి బాధ పడుతున్న వారు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.


Recent Random Post: