‘కనీసం ప్రాణాలతో వచ్చాను..’ పంజాబ్ సీఎంపై ప్రధాని మోదీ అసహనం..!

పంజాబ్ రాష్ట్రంలో తనకు ఎదురైన చేదు అనుభవంపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ లోని భఠిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యక్రమ స్థలికి హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు.

దీంతో రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ లో ఆందోళనకారులు బ్లాక్ చేయడంతో మోదీ ట్రాఫిక్ లో 20 నిమిషాలపాటు చిక్కుకుపోయారు. దీంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని భఠిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై మోదీ అక్కడి అధికారులతో.. ‘మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. కనీసం ఎయిర్ పోర్టుకైనా నేను ప్రాణాలతో తిరిగి రాగలిగాను’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యం కారణంగా భద్రతా వైఫల్యం జరిగిందని మండిపడింది.


Recent Random Post: