పవన్ – హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలను చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే వకీల్ సాబ్ ను విడుదల చేసిన ఈ హీరో, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు చేస్తున్నాడు.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీన్ని ఆగస్ట్ నుండి మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దాని ప్రకారం ఈ ప్రాజెక్ట్ కు సంచారి టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం బలంగా జరుగుతోంది. మరి ఇందులో ఏవి నిజాలో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


Recent Random Post: