కత్తి మహేష్‌ ఆరోగ్యంపై వాకబు చేసిన పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ అభిమానులు అత్యంతగా వ్యతిరేకించే… అసహించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కత్తి మహేష్‌ అంటూ చాలా మంది అంటూ ఉంటారు. కత్తి మహేష్‌ ఒకానొక సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ను తీవ్రంగా విమర్శించాడు. ఈమద్య కాలంలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే విమర్శిస్తూనే ఉన్నాడు. దాంతో ఆయన పై ఎప్పుడు పవన్ అభిమానులు కత్తి దూస్తూ ఉంటారు. తాజాగా కత్తి మహేష్‌ కు యాక్సిడెంట్‌ అయ్యింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఆయన మెల్లగా కోలుకుంటున్నాడు.

కత్తి మహేష్ ఆరోగ్యం గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ వాకబు చేశాడట. అమరావతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ సందర్బంగా సన్నిహితులను ఆ జిల్లకు సంబంధించిన నాయకులను కత్తి మహేష్ గురించి ప్రశ్నించాడట. అంతే కాకుండా కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నాడట. మొత్తానికి తనను అత్యంత హీనంగా విమర్శించిన వ్యక్తిని కూడా ఇలా సానుకూలంగా స్పందించడం పవన్‌ కు మాత్రమే చెల్లింది అంటూ జనసైనికులు అంటున్నారు.


Recent Random Post: