మరో తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ కు ముడిపెట్టి పుకార్లు

తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రాబోతుంది అంటూ గతంలో చాలా పుకార్లు షికార్లు చేశాయి. మీడియాలో వస్తున్న పుకార్లపై అట్లీ కూడా ఒకసారి స్పందించాడు. ఎన్టీఆర్ మంచి నటుడు. ఆయనతో సినిమా చేసేందుకు నేను ఆసక్తిగానే ఉన్నాను. కాని అందుకు సమయం పట్టే అవకాశం ఉందన్నాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ పేరును లోకేష్‌ కనగరాజ్ తో జత చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా ఉండబోతుంది అనేది పుకార్ల సారాంశం.

కార్తీతో ఖైదీ అనే సినిమా ను చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న లోకేష్‌ ఇటీవల విజయ్ తో మాస్టర్‌ సినిమాను చేశాడు. మాస్టర్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని టీజర్‌ ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత తమిళ సూపర్‌ స్టార్‌ తో లోకేష్ మూవీ ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత రాబోయే రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్ మరియు లోకేష్‌ ల మూవీ వచ్చే అవకాశం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు నిజం అనేది వేచి చూడాలి. వీరిద్దరి కాంబో నిజం అయితే ఖచ్చితంగా సంచలనం అని చెప్పుకోవచ్చు.


Recent Random Post: