ఎన్టీఆర్ – బుచ్చి బాబు సినిమాపై షాకింగ్ అప్డేట్

ఆర్ ఆర్ ఆర్ విజయం తర్వాత ఎన్టీఆర్ వరసగా ప్యాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెడుతోన్న విషయం తెల్సిందే. సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఇంటెన్స్ డ్రామాతో ఉంటుందని తెలుస్తోంది.

అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా అని కూడా చెబుతున్నారు.

అయితే దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే ఇందులో ఎన్టీఆర్ ఒక అవిటివాని పాత్రలో కనిపిస్తాడట. చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని డీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఆర్ ఆర్ ఆర్ తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పెద్ద సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.


Recent Random Post: