ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నేడు నందమూరి తారక రామారావు 98వ జన్మదినం అవ్వడంతో సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలతో జయంతి పోస్ట్‌ లు పెడుతున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి అయిన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు.

ట్విట్టర్ లో చిరంజీవి.. ప్రముఖ గాయకులు భూపేన్‌ హజారికా గారికి మరణం అనంతరం భారత రత్న ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇచ్చినట్లుగా తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. అది తెలుగు వారు అందరికి గర్వ కారణం. అన్నగారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సమయంలో ఆయనకు ఈ గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.


Recent Random Post: