ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మూడు సర్‌ ప్రైజ్ లు సిద్దం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ బర్త్‌ డే కు కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. మే 20వ తారీకున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ నుండి పోస్టర్ రావడం కన్ఫర్మ్‌ అయ్యింది. రాజమౌళి ఇప్పటికే కొమురం భీమ్‌ కొత్త పోస్టర్ తో సిద్దంగా ఉన్నాడు. ఇదే సమయంలో మరో రెండు బర్త్‌ డే గిప్ట్‌ లు కూడా ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ 30వ సినిమా టైటిల్‌ ను పుట్టిన రోజు సందర్బంగా రివీల్ చేసేందుకు కొరటాల శివ ఏర్పాట్లు చేస్తున్నాడట. టైటిల్‌ లోగోను కూడా ఇప్పటికే డిజైన్‌ చేయించారనే వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ ను కూడా ఇవ్వబోతున్నారట. బర్త్‌ డే సందర్బంగా సినిమాను అధికారికంగా ప్రకటించడం లేదా సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేయడం చేస్తారట. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్‌ డే కు మూడు సర్ ప్రైజ్ లు సిద్దంగా ఉన్నాయి.


Recent Random Post: