టీఆర్ఎస్ సాగర్ టికెట్ నోమల భగత్ కే..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయకుండా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేకెత్తించిన టీఆర్ఎస్.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంది. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇచ్చింది. నామినేషన్లు వేయడానికి మరొక్క రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

టీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత తన అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ వేచి చూస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఖరారు కావడంతో బీజేపీ కూడా సోమవారమే తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీదున్న ఆ పార్టీ.. సాగర్ ను కూడా తమ ఖాతాలోనే వేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. హాలియాలో సీఎం కేసీఆర్ సభ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Recent Random Post: