నరేంద్ర మోడీ ‘బంగ్లా జపం’ బెంగాల్ కోసమేనా.!

భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో విదేశీ పర్యటనలకు దూరంగా వున్న ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ 50వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకల కోసం వెళ్ళడం గమనార్హం.

సరిగ్గా అదే సమయంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రసహనం నడుస్తోంది. దాంతో, ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనపై రాజకీయ రచ్చ చెలరేగింది. బంగ్లాదేశ్ దేశానికి ప్రధాని వెళ్ళడాన్ని పశ్చిమబెంగాల్ ఎన్నికలతో ముడిపెట్టడమేంటి.? మామూలుగా అయితే ముడిపెట్టలేని అంశమిది. కానీ, ఎన్నికల వేళ ఎలాంటి జిమ్మిక్కలు చేయడానికైనా ప్రధాని మోడీ వెనుకాడరు గనుకనే.. మోడీ బంగ్లాదేశ్ పర్యటనపై వివాదాలు రాజుకున్నాయి. దీన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా కొందరు అభివర్ణించారు.

ఇక, బంగ్లాదేశ్ పర్యటనలో మోడీ, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ, ఆ స్వాతంత్ర్యం కోసం తాను కూడా ప్రార్థించాననీ, జైలుకు కూడా వెళ్ళాననీ సెలవిచ్చారు. ఇదెక్కడి రాజకీయం.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. పాకిస్తాన్ నుంచి తూర్పు బెంగాల్ ప్రాంతం.. బంగ్లాదేశ్ అనే దేశంగా ఏర్పడే క్రమంలో యుద్ధం జరిగింది.. అదీ భారత్ – పాకిస్తాన్ మధ్య. అయితే, ఆ సెగ భారతదేశంలో ఎక్కడా లేదు. మరి, నరేంద్ర మోడీ ఎందుకు జైలుకు వెళ్ళినట్లు.? ఈ అంశం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

మోడీ అంటేనే అబద్ధాల పుట్ట అని ఇంకోసారి నిరూపితమయ్యిందని కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతర పార్టీలకు చెందిన మద్దతుదారులు నినదిస్తున్నారు. బీజేపీ మద్దతుదారులు ఈ ట్రోలింగుపై సమాధానం చెప్పుకోలేక గింజుకోవాల్సి వస్తోంది. బంగ్లాదేశ్ సానుభూతిపరులు చాలామంది పశ్చమబెంగాల్ రాష్ట్రంలో వుంటారు గనుక, ఆ సానుభూతి ఓటు కోసమే నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటారని.. రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


Recent Random Post: