వీడియో: ఉద్రేకం ఉద్రిక్తం.. కత్తితో నారప్ప నరుకుడు..!

ఉద్రేకం.. ఉద్రిక్తం.. రభస.. గొడవ గొడవ.. ఆ దృశ్యం చూశాక ఎవరైనా ఇలా ఆవేశ పడిపోతారు. కంగారు పడిపోతారు. పల్లెటూళ్లో గొడవలొస్తే ఆషామాషీగా ఏం ఉండదు. రాయలసీమ పల్లెటూరా.. ఉత్తరాంధ్ర.. కోస్తాంధ్ర ఊరి గొడవనా.. .. గోదారి పల్లెటూరునా.. ఏదైనా గొడవ గొడవే.. ఎక్కడొచ్చినా కోస్తారు. కత్తి దూస్తారు. భూముల గొడవలు.. పరువు కక్షలు.. కులం కొట్లాటలు ఇలా చాలానే ఉంటాయి.

ముఖ్యంగా కుల ఘర్షణలు అనే టాపిక్ పై బాలీవుడ్ టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో బోలెడన్ని సినిమాలొచ్చాయి. విజయాల్ని సాధించాయి. కోలీవుడ్ లో తెరకెక్కిన అసురన్ బంపర్ హిట్టయ్యింది. ధనుష్ తక్కువ కులం వాడిగా నటించి మెప్పించారు. ఎంతో విజ్ఞానం పెరిగినా శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎదిగినా మనిషిలో మృగం మారలేదు. ఇంకా కులం మతం ప్రాంతం అంటూ కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ మనుషులే అంత.. ఇక నారప్పలో కులం కొట్లాటల్ని యథార్థ కథని చూపించారు. వెంకీ తన పాత్రలో నటించారు అనేకంటే జీవించారు అంటూ అతిశయోక్తి కాదు. ఇప్పటికే అతడి నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇలాంటి సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ విజువల్స్ సాక్ష్యం. ప్రత్యర్థులపై ఎగబడుతూ కత్తి దూస్తూ వెంకీ మామ లో ఎమోషన్ ని రగిలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్తమవుతుంది. గొడవకు దిగితే నరుకుడే అన్నంతగా వెంకీ చెలరేగుతున్నారు. నిజానికి ఆ సన్నివేశంలో కత్తి వేటుకు తెగి పడుతున్న వారి హావభావాలు వందశాతం అతికాయి. జూ ఆర్టిస్టులు ఫైటర్స్ ఎంతో అద్భుతంగా తమ పనితనాన్ని కనబరిచారు. అందుకే ఈ బిహైండ్ ది స్క్రీన్ సపోర్టర్స్ ని స్నీక్ పీక్ పేరుతో ఇలా వీడియో రూపంలో ఆవిష్కరించారు. నారప్ప ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ -వీ క్రిఏషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.


Recent Random Post: