జెర్సీ దర్శకుడితో మరోసారి జట్టుకట్టనున్న నాని

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే జెర్సీ చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అలాగే తనకెంతో గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం కూడా. ఈ సినిమాకు ఇటీవలే రెండు నేషనల్ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. జెర్సీ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ టైటిల్ తోనే తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం పూర్తైన తర్వాత గౌతమ్ చేయబోయే తెలుగు సినిమా నానితోనే అని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారట. నాని ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదలకు సిద్ధమైంది.

అలాగే శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ దశలో ఉంది. అంటే సుందరానికి చిత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో పట్టాలెక్కనుంది.


Recent Random Post: