జబర్దస్త్, అదిరింది టీమ్ లకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన నాగబాబు

నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుక ఈ నెల 9న ధూమ్ ధామ్ గా జరిగిన విషయం తెల్సిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక పెళ్లి గుంటూరు రేంజ్ ఐజీ కొడుకు వెంకట చైతన్యతో జరిగింది. అయితే కోవిద్ వలన పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదు.

చైతన్య తరుపు కుటుంబం, నాగబాబు తరుపు కుటుంబసభ్యులు మాత్రమే ఈవెంట్ కు హాజరయ్యారు. మూడు రోజుల పాటు వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. ఇదిలా ఉంటే ఈ నెల 15న జబర్దస్త్, అదిరింది టీమ్ సభ్యులకు నాగబాబు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నా తన యూట్యూబ్ ఛానల్ లో ఈరోజు వీడియో విడుదల చేసారు.

ఈ గ్రాండ్ పార్టీకు నూతన దంపతులు, ఇంకా జబర్దస్త్, అదిరింది టీమ్ ల నుండి రాఘవ, సుధాకర్, భాస్కర్, గెటప్ శ్రీను, అవినాష్, చంద్ర, సద్దాం, హరి, యాదమ్మ రాజు, యాంకర్ రవి, భానుశ్రీ, శ్రీముఖి, అనసూయ, జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు


Recent Random Post: