అంతర్జాతీయ అవార్డుకు నామినేట్‌ అయిన మోనాల్‌

తెలుగు ప్రేక్షకులకు సినిమా ద్వారా పరిచయం అయిన మోనాల్‌ పెద్దగా సక్సెస్‌ అవ్వలేక పోయింది. మొదటి సినిమా నిరాశ పర్చడంతో ఆ తర్వాత కూడా పెద్దగా స్టార్‌ డం దక్కక పోవడంతో తెలుగు సినిమాలను వదిలేసి మోనాల్ ఉత్తరాదికి వెళ్లి పోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. ఆ సమయంలోనే బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 4 నుండి ఆఫర్‌ రావడంతో అమ్మడు మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్‌ లో అనూహ్యంగా చివరి వరకు ఉంది. ఆమె లవ్‌ ట్రాక్‌ లు నడిపించడం వల్లే ఎక్కువ రోజులు ఉందని అనే వారు ఎక్కువ మందే ఉన్నా కూడా ఆమెకు మంచి పాపులారిటీ దక్కిందని మాత్రం చాలా మంది అంటున్నారు.

బుల్లి తెర పాపులర్‌ స్టార్స్ టాప్ జాబితాలో మోనాల్ నిలవడం ఆశ్చర్యంగా ఉంది. బిగ్ బాస్ తర్వాత వరుసగా బుల్లి తెరపై కనిపిస్తూ వస్తున్న మోనాల్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ టీవీ ఆర్టిస్టు అవార్డుకు మొత్తం ఆరుగురిలో ఒకరుగా ఎంపిక అయ్యారు. ఆరు మందిలో మోనాల్‌ కూడా ఉండటం నిజంగా ఆశ్చర్యకర విషయం. ఆమెను ఓట్లు వేసి గెలిపిస్తే విజేతగా నిలిచే అవకాశం కూడా ఉంది. ఉత్తరాది ముద్దుగుమ్మలతో ఈమె పోటీ పడబోతుంది. మరి ఎవరిని విజేతగా నిర్వాహకులు ప్రకటిస్తారో చూడాలి.


Recent Random Post: