ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు తన గురించి తెలుసుకుని రావాలన్న మోనాల్

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ కు రాకముందు నాలుగైదు సినిమాల్లో నటించింది. అయితే అవేమి ఆమెకు క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. కానీ గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె పాల్గొంది. ఫైనల్స్ కు ముందు ఆమె ఎలిమినేట్ అయినా కానీ మోనాల్ గజ్జర్ ఆమెకు సూపర్బ్ క్రేజ్ ను తీసుకొచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఏదొక కారణంతో ఆమె వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా మోనాల్ గజ్జర్ కు అవకాశాలు బాగా వచ్చాయి. అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అలాగే స్టార్ మా లో వస్తోన్న డ్యాన్స్ ప్లస్ షో లో ఒక జడ్జ్ గా వ్యవహరిస్తోంది మోనాల్. కాగజ్ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది.

ఇటీవలే ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తి తనకు కాగజ్ గురించి తెలియదని చెప్పడంతో మోనాల్ సీరియస్ అయింది. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే ముందు తన గురించి తెలుసుకోవాలని అతనికి సూచించింది.


Recent Random Post: