గర్బవతి అని కూడా ప్రకటించకుండా బిడ్డకు జన్మనిచ్చింది

మలయాళి ముద్దుగుమ్మ మియా జార్జ్‌ ఇన్ స్టా గ్రామ్‌ లో తనకు కొడుకు పుట్టాడు అంటూ అతడి పేరు కూడా ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఆమె సన్నిహితులు కూడా షాక్ అవుతున్నారు. వారు షాక్ అవ్వడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మియా జార్జ్‌ గర్బవతి అని కూడా ఎప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అయినా షేర్‌ చేయలేదు. ఇప్పటి వరకు గర్బవతి అని కూడా చెప్పకుండానే మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

తన కొడుకు పేరును కూడా ప్రకటించిన మియా జార్జ్‌ ఇచ్చిన షాక్ నుండి మెల్లగా కోలుకుంటున్న అభిమానులు మరియు ఫాలోవర్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. మియా జార్జ్ తన కొడుకు లుకా జోసెఫ్‌ అని పేరు పెట్టింది. తన కొడుకుకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కావాలని ఆమె కోరింది. భర్త మరియు తన కొడుకు ఫొటోను షేర్‌ చేసిన మియా జార్జ్ ప్రస్తుతం నెట్టింట ఆ ఫొటోతో వైరల్‌ అవుతోంది. క్యూట్ ఫ్యామిలీ అంటూ అంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.


Recent Random Post: