సంక్రాంతి వార్: మహేష్ వెర్సస్ పవన్!?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో దిగడానికి కర్చీఫ్ వేసిన విషయం తెల్సిందే. తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటను సంక్రాంతి 2022కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈసారి మహేష్ కు సంక్రాంతి పోరులో భారీ కాంపిటీషన్ ఉండబోతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ అందులో ఒకటి కాగా, రెండోది క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడిక్ డ్రామా.

క్రిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2022కు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 11న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. అప్పుడే రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Recent Random Post: