మరో పాపులర్ కమెడియన్ హీరోగా గుండె కథ వింటారా?

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టాక్సీ వాలా వంటి సినిమాలతో కమెడియన్ గా పాపులర్ అయిన మధునందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మధునందన్ హీరోగా నటించిన తొలి సినిమా వివరాలు ఈరోజు వెల్లడయ్యాయి. ఈ సినిమాకు గుండె కథ వింటారా అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు మధునందన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు.

ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గుబురు గెడ్డంతో మధునందన్ ఇంప్రెసివ్ గా ఉన్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ ను అడివి శేష్ విడుదల చేయడం విశేషం. వంశీధర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వాతిష్ఠ కృష్ణన్, శ్రేయ నవిలే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గుండె కథ వింటారా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.


Recent Random Post: