అల్లు అర్జున్ ను సచిన్ టెండూల్కర్ తో పోల్చిన కమెడియన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్ సెలబ్రిటీలలో కచ్చితంగా అల్లు అర్జున్ ఉంటాడు. కానీ బన్నీని క్రికెట్ గాడ్ తో కోట్లాది మంది కొలిచే సచిన్ టెండూల్కర్ తో పోల్చాడు కమెడియన్ మధునందన్.

గుండె జారీ గల్లంతయ్యిందే వంటి సినిమాల్లో మధునందన్ కమెడియన్ గా ఫేమస్ అయ్యాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పోల్చాడు.

“బన్నీ హార్డ్ వర్కింగ్ విషయంలో సచిన్ అంత కృషి చేసాడు. అల్లు అర్జున్ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఓ నటుడు ఎలా ఉండాలో అంటే నాకు తెలిసి కచ్చితంగా బన్నీలా ఉండాలి. నాలాంటి ఎంతో మందికి ఆదర్శం అల్లు అర్జున్” అని చెప్పుకొచ్చాడు మధునందన్.


Recent Random Post: