‘సింగరేణి జోలికొస్తే తడాఖా చూపిస్తాం’.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

కేంద్రం సింగరేణి జోలికి వస్తే ఆ సెగ ఢిల్లీని తాకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు. ‘ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు కేంద్రం తెర తీస్తోంది. సింగరేణిని బలహీనపరచి, నష్టాల సంస్థగా మార్చే కుట్ర చేస్తోంది. సంస్థను నష్టాల్లో చూపించి ప్రైవేటుపరం చేయాలనే బీజేపీ ఆలోచన చేస్తోంది’.

‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సింగరేణిలో ఇప్పటివరకూ 16వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాల కల్పనలో సింగరేణి కోల్డ్ మైన్ ఒక గోల్డ్ మైన్. గనులు మూత పడితే ఉద్యోగాలూ పోతాయి. సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ ఢిల్లీని తాకుతుంది. సింగరేణిని ప్రైవేటుకి అప్పగించాలని చూస్తూ బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతుంది. సింగరేణికి సొంత గనులు కేటాయించాలి. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది’ అని లేఖలో పేర్కొన్నారు.


Recent Random Post: