ఆచార్య బడ్జెట్ భారం కొరటాలకు చుట్టుకుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ నిలిచిపోవడం ఇది రెండోసారి. మే 14కి విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.

సాధారణంగా కొరటాల శివ తన సినిమాల ఫైనాన్స్ ల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. తనకు ఒక డిస్ట్రిబ్యూషన్ టీమ్ లాంటిది ఉంది. తను చెప్పిన రేట్లకు తను చెప్పిన వాళ్లకు తన సినిమాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.

భరత్ అనే నేను చిత్రం విషయంలో దానయ్యకు, కొరటాలకు మధ్య చిన్నపాటి తేడా వచ్చిందని అంటుంటారు. అయితే ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రం సేఫ్ సైడ్ గా నిర్మాత ఫీజ్ పేరిట 5 కోట్లు చెల్లించాలని ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక బిజినెస్ వ్యవహారం తలనొప్పి మొత్తం కొరటాలకే అన్నమాట. మాములుగా అయితే ఈ ఆఫర్ చాలా టెంప్టింగ్ అని చెప్పాలి. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వడ్డీలు పెరిగిపోతూ బడ్జెట్ పరిమితులు దాటిపోతోంది.


Recent Random Post: