రామ్ చరణ్ నాకు దొరికిన ప్రసాదం: కొరటాల

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరుగా కనిపిస్తారు. ఒక దానికి మించి మరొక హిట్ ను అందిస్తూ అపజయమెరుగని దర్శకుడిగా ఆయన దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రమైన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. చిరంజీవి – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు రానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రచార చిత్రాలు .. పాటలు అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడారు.

“ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ‘ఆచార్య’ ఉంటాడు. మన పెద్దలు .. మన పురాణాలు ఆచార్యుడిని నమ్మి .. ఆయనపై పూర్తి భారం వేయమనే చెప్పాయి. ఆచార్య మనలను రక్షిస్తాడు .. మన బతుకులను బాగు చేస్తాడు అనే నమ్మకంతోనే పూర్వం గురుకులాలలో చేరేవారు. అలా రక్షించడం కోసం ఉన్నవాడిగానే ఈ సినిమాలో ఆచార్య కనిపిస్తాడు. ‘పాఠాలు చెప్పే ఆచార్యను కాను .. గుణపాఠాలు చెప్పే ఆచార్యను’ అనే డైలాగ్ చిరంజీవి నోటి నుంచి రావడం వలన అంతగా పేలింది .. అంతగా పండింది. తెరపై నేను చిరంజీవిగారినికి ఎలా చూడాలని అనుకున్నానో .. అలా చూపించడానికి ప్రయత్నించాను.

ముందుగా నేను ఒక కథను అనుకుంటాను. ఆ తరువాత ఫలానా పాత్రకి ఫలానా వారైతే బాగుంటుందని భావించి ఆ దిశగా ముందుకువెళతాను. ఆర్టిస్టుల క్రేజ్ ను బట్టి కథను పక్కకి తీసుకెళ్లకుండా .. కమర్షియల్ హంగుల కోసం కథను ఎక్కువగా పొల్యూట్ చేయకుండా చూసుకుంటాను. కథ ఆత్మ దెబ్బతినకుండా .. ఆరిస్టుల స్టార్ డమ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే అభిమానుల అంచనాలకి తగ్గకుండా దృష్టి పెడుతుంటాను. అన్ని హంగులు దిద్దుతాను. చిరంజీవిగారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అన్నివైపుల నుంచి ఆ స్థాయి అంశాలను అల్లుకుంటూ వచ్చాను.

ఇవన్నీ కాకుండా ఈ సినిమా పరంగా నాకు దొరికిన ప్రసాదం .. రామ్ చరణ్. ఇంతకుముందు ఆయన చిరంజీవి సినిమాల్లో జస్ట్ అలా కనిపించి వెళ్లిపోయారు. చిరంజీవిగారితో కలిసి చరణ్ చేసిన కాస్త నిడివి గల పాత్ర ఇదే. సిద్ధ పాత్రకి చరణ్ ను తీసుకుందామని చిరంజీవిగారితో చెప్పగానే ఆయన ఓకే అన్నారు. చరణ్ గారిని అడగ్గానే వెంటనే ఆయన ఒప్పుకున్నారు. కథపై .. పాత్రపై .. నాపై గల నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా గురుకులం నుంచి వచ్చిన వారు అన్నింటిలో నిష్ణాతులై ఉంటారు. ఈ సినిమాలో చరణ్ అలాగే కనిపిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.


Recent Random Post: