హుజూరాబాద్‌ లో కొండ సురేఖ

హుజూరాబాద్‌ లో పోటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇన్నాళ్లు ఎవరిని ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని తీవ్ర చర్చలు జరిగాయి. రేవంత్ రెడ్డి ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హుజూరాబాద్‌ లో కాంగ్రెస్ పోటీ ఉండక పోవచ్చు అన్నట్లుగా మాట్లాడాడు. ఆ సమయంలో ఆయనపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎలా ఓడి పోతామన్నట్లుగా మాట్లాడుతారు అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ లో గెలవకున్నా కూడా గట్టి పోటీ ఇవ్వాలని మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవ స్థానంలో లేదా మూడవ స్థానంలో అయినా నిలిచేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం కొండ సురేఖ ను అక్కడ నిలపాలనే నిర్ణయానికి వచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొండ సురేఖ ను నిలపవడం వల్ల అక్కడ బీసీ సామాజిక వర్గంకు సంబంధించిన ఓట్లు పడతాయనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. అందుకే ఆమెను నిలిపి సత్తా చాటాలనుకుంటున్నారు. ఆమెకు సంబంధించినంత వరకు స్థానికత విషయమై విమర్శలు వస్తాయేమో చూడాలి.


Recent Random Post: