కేంద్రంపై కేసీఆర్ యుద్ధం చేస్తానంటే బీజేపీ సిద్ధం: కిషన్ రెడ్డి

బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయ యుద్ధం చేస్తానంటే ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాను సవివరంగా త్వరలో స్పందిస్తానని అన్నారు. బీజేపీ ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి లేదని అన్నారు.

పర్యాటకంపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ మ్యూజియం సదస్సును ఈనెల 15,16 తేదీల్లో హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న గిరిజన మ్యూజియంకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించలేదని అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు గిరిజన, పర్యాటక సాంస్కృతిక శాఖల ద్వారా 2.50 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదించిందని అన్నారు.

స్వదేశీ దర్శన్ లో భాగంగా గిరిజన సర్క్యూట్స్ అభివృద్ధిలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ 2016-17 లోనే80 కోట్లతో లక్కవరం, మేడారం, తాడ్వాయి, దామరవి, మల్లూరు, బొగత జలపాతాల అభివృద్ధి చేపట్టిందని అన్నారు.


Recent Random Post: