కీర్తి సురేష్ కు చెల్లెలి పాత్రలు బాగానే కలిసొస్తున్నాయిగా!

హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో ఏ హీరోయిన్ కూడా చెల్లెలి పాత్రలపై ఆసక్తి చూపించారు. దీని తర్వాత హీరోలు తమతో లీడ్ రోల్ లో నటించడానికి ఇష్టపడరన్నది దీని వెనకున్న ప్రధాన కారణం. అయితే కీర్తి సురేష్ మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అన్నాత్తే చిత్రంలో నటించింది. రజినీ చెల్లెలి పాత్రలో కీలక పాత్రను పోషించింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే కీర్తికి మాత్రం ఫైనాన్షియల్ గా బాగానే కలిసొచ్చిందిట.

ఆ సినిమాలో రజినీ చెల్లిగా నటించినందుకు గాను దాదాపు 2 కోట్ల రూపాయలను ఛార్జ్ చేసినట్లు సమాచారం. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కూడా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చెల్లెలిగా భోళా శంకర్ లో కనిపించనుంది. ఈ రోల్ కోసం కూడా కీర్తి అదే రేంజ్ అమౌంట్ ను ఛార్జ్ చేస్తోందిట.


Recent Random Post: