సింగర్ సునీత వివాహంపై కత్తి మహేష్ కామెంట్స్..!


ప్రముఖ గాయని సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి వీరి పెళ్లి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. అప్పటికే స్నేహితులు అయిన రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించడం విశేషం. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న అమ్మకు తోడు దొరికినందుకు సునీత పిల్లలిద్దరూ హ్యాపీగా ఉన్నట్లు ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. అయితే సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే.. మరొకొందరు సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ చేశారు. పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని కన్నతల్లి మళ్ళీ వివాహం చేసుకోవడం ఏమిటి? అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఇలాంటి విమర్శలు చేసే వారిపై సినీ విమర్శకుడు నటుడు కత్తి మహేష్ ఫేస్ బుక్ వేదికగా తనదైన శైలిలో స్పందించాడు. ”సింగర్ సునీత పెళ్లి చేసుకున్నా మనోభావాలు దెబ్బతీసుకుంటారేంటి ఈ బత్తాయిలు?!?” అంటూ పోస్ట్ చేసాడు మహేష్.

”ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో “ఇబ్బంది”?. అరే… ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని సంతోషంగా కనిపిస్తే.. హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండో పెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ ఏడుపు ముఖాలతో కనిపించాలి గానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి? ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా… హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!” అంటూ సునీత-రామ్ వివాహంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై సెటైర్లు వేశాడు కత్తి మహేష్. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ మహేష్ పోస్టుకి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.


Recent Random Post: