#చందమామ.. 36 లోనూ అవే మెరుపులు..!

టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ కొనసాగించినా ఇప్పటికీ హవా తగ్గని నాయికగా కాజల్ (36) పేరు మార్మోగుతోంది. చందమామ అందం చందం వయసుతో పాటు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. ఇక ప్రతిభావంతురాలిగా నిరంతరం అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల చిరంజీవి-నాగార్జున- కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలతో కాజల్ బిజీగా ఉంది.

మరోవైపు 16 ఏళ్ల కెరీర్ జర్నీలో కాజల్ లేడీ ఓరియెంటెడ్ కోసం పూర్తిగా పాకులాడకుండా గ్లామరస్ నాయికగా నటిస్తూనే పాత్రల్లో వైవిధ్యం కోసం ప్రయత్నించడం ఆసక్తికరం. ప్రస్తుతం `ఉమ` అనే నాయికా ప్రధాన చిత్రంలో కాజల్ నటిస్తోంది. కమల్ హాసన్ సరసన -భారతీయుడు 2.. చిరంజీవి సరసన ఆచార్యలో కాజల్ నటించడం ఆసక్తిని కలిగిస్తోంది.

భారతీయుడు 2 ఇటీవల వివాదం వల్ల పెండింగులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున సరసన ప్రవీణ్ సత్తారు చిత్రంలో అవకాశం దక్కించుకున్నా కానీ ఫ్రెగ్నెన్సీ వల్ల ఆ సినిమాని వదులుకుందని ప్రచారమైంది. కాజల్ తాను వలచిన సఖుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసినదే.

కాజల్ అగర్వాల్ తొలిగా హిందీ పరిశ్రమలో స్నేహితురాలి పాత్రతో పరిచయమైంది. `క్యూ హో గయానా` అనే బాలీవుడ్ చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణంతో పరిచయమైంది.ఆ తర్వాత కాజల్ అందచందాలకు ప్రతిభకు మురిసిపోయి తెలుగు చిత్రసీమ తనలో వోన్ చేసుకుంది. రామ్ చరణ్- బన్ని వంటి అగ్ర హీరోల సరసన కెరీర్ ఆరంభమే బ్లాక్ బస్టర్లు అందుకుని అటుపై పరిశ్రమ అగ్ర హీరోలందరి సరసనా నటించి మెప్పించింది.

ముఖ్యంగా చరణ్ సరసన మగధీరలో మిత్రవిందగా నటించి గుండెల్లో నిలిచిపోయింది కాజల్. ఇటీవల సీనియర్ హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారింది ఈ బ్యూటీ. ఒక్కో సినిమాకి దాదాపు 2-3 కోట్ల పారితోషికం అందుకుంటున్న కాజల్ ఐటమ్ నంబర్లలోనూ నర్తించింది. సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.


Recent Random Post: