ఎన్టీఆర్‌ పారితోషికం మరీ అంత పెంచేశాడా?

మన తెలుగు స్టార్‌ హీరోల పారితోషికాలు బాలీవుడ్ స్టార్‌ హీరోల పారితోషికాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటున్నాయి. ఒక్కో హీరో పాతిక నుండి మొదలుకుని వంద కోట్ల వరకు కూడా తీసుకుంటున్నారు. తెలుగు లో రాజమౌళి దర్శకత్వంలో సినిమా లు చేయడం పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవడం. ఆ తర్వాత భారీ పారితోషికం తీసుకోవడం చేస్తున్నారు. బాహుబలి తో ప్రభాస్ పారితోషికం వంద కోట్లకు చేరువ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ పారితోషికం కూడా భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ పారితోషికం విషయంలో చాలా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు 30 కోట్లు అందుకు ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు 50 కోట్లు అందుకుంటున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్న సినిమా కు గాను ఏకంగా 75 కోట్లను అందుకుంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పెద్ద మొత్తం లో ఈయన సినిమా వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో భారీ గా పారితోషికం అందుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో 100 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.


Recent Random Post: