ఎన్టీఆర్ పుట్టినరోజున కొరటాల శివ చిత్రంపై పూర్తి క్లారిటీ

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కీలక అప్డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఆ రోజున తొలగిపోనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెల్సిందే. అయితే ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ వర్క్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇక ఎన్టీఆర్30 ఆలస్యం అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. కానీ అవన్నీ వట్టి రూమర్స్ అని మే 20న అప్డేట్స్ తో నిరూపించనున్నారు. ఆ రోజున మోషన్ పోస్టర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్, ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా వెల్లడిస్తారు.

అలాగే ఎన్టీఆర్31, ఎన్టీఆర్32 ప్రాజెక్ట్స్ విషయంలో కూడా అధికారిక కన్ఫర్మేషన్ ను ఆశిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. చూడాలి మరి ఆ రోజు ఏం జరుగుతుందో.


Recent Random Post: