ఒత్తిడిలో తారక్..’ఆర్ ఆర్ ఆర్’ తో హై అలెర్ట్!

‘ఆర్ ఆర్ ఆర్’ సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అతని ఇమేజ్ తెలుగులో రెట్టింపు అయితే..ఇతర భాషల్లో ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ఫలితంపై సందేహాలున్నప్పటికీ అక్కడా సక్సెస్ అయింది. తారక్ పాత్ర విషయంలో అభిమానుల్లో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ పాత్ర గొప్పతనం తారక్ ని మిగతా హీరోకి ధీటుగా నిలబెట్టిందన్నది వాస్తవం.

ఇక సినిమా బాక్సాఫీస్ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా దేశం మొత్తం మారుమ్రోగిపోయింది. ఇండియాన్ సినిమా హిస్టరీలో వసూళ్ల పరంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూడవ స్థానంలో నిలబడింది. అయితే ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఏ హీరోపైనైనా తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కొంత ఒత్తిడి సహజం.

కానీ తారక్ కొత్త ప్రాజెక్ట్ విషయంలో ముందే ఓనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్ లో ఉండగానే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించి కాస్త ఒత్తిడి తగ్గించుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు విషయంలో కొంత తర్జనభర్జన పడ్డారు. కొత్త మేకర్ ..చేసింది ఒకటే సినిమా ..అప్పుడే అతనితో సినిమా ఏంటి? అని పునరాలోచనలో పడి తాత్కాలికంగా అతన్ని పక్కనపెట్టారు.

ఆ రకంగా బుచ్చిబాబు ప్రెజర్ ఇంకాస్త తగ్గించుకున్నారు. అయితే అసలైన ఒత్తిడి ఇప్పుడు తారక్ లో మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే కొరటాల దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఫలితం తారక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. అప్పటివరకూ వరుసగా సక్సెస్ లు ఇచ్చిన ఇద్దరు బిగ్ స్టార్లని ఆవిష్కరించడంలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీంతో తారక్ కొరటాల ప్రాజెక్ట్ విషయంలో హై అలెర్ట్ అయినట్లు సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. స్ర్కిప్ట్ విషయంలో పూర్తి క్లారిటీ కావాలని…తనకేమైనా సందేహాలుంటే ముందు క్రాస్ చెక్ చేసుకుని మళ్లీ నేరేట్ చేయమని తారక్ కోరినట్లు సమాచారం. మేకింగ్ పరంగా స్పార్క్ నెస్ ని అలవాటు చేసుకోవాలని.. అందుకోసం ‘ఆర్ ఆర్ ఆర్’.. ‘కేజీఎఫ్-2’ చిత్రాల మేకింగ్ ని బాగా స్టడీ చేయమని సూచనలు…సలహాలు జారీ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

అలాగే బుచ్చిబాబు ఎంపిక చేసుకున్న స్పోర్స్ట్ డ్రామా విషయంలోనూ మార్పులు కోరినట్లు వినిపిస్తుంది. ఇందులో తారక్ 60 ఏళ్ల వృద్ద పాత్రలో..యువకుడిగా ద్విపాత్రినయం చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి తారక్ కొన్ని ఇన్ పుట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. తారక్ అలెర్ట్ ని బట్టి చూస్తుంటే బుచ్చిబాబు సినిమా కొరటాల సినిమా సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది అని మరో సందేహం ఉత్పన్నం అవుతుంది.

కొరటాల మూవీ సక్సెస్ అయితే బుచ్చిబాబుల కి లైన్ క్లియర్ గా ఉంటుంది. లేదంటే? కష్టమే అన్న సంకేతాలు అందుతున్నాయి. చూసారా ఒక సినిమా వైఫల్యం ఎన్ని సందేహాలకి తావిస్తుందో


Recent Random Post: