కొరటాల శివకు కొత్త కండిషన్ పెట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా మార్కెట్ ను కోరుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తోన్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది కాబట్టి కచ్చితంగా ఈ చిత్రంతో ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది.

ఒకసారి హీరోలకు ప్యాన్ ఇండియా ఇమేజ్ వస్తే ఇక దాన్ని కొనసాగించాలనే అనుకుంటారు. ఇదే క్రమంలో ప్రభాస్ వరసగా నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలను సెట్ చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు.

ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో సిద్ధం చేయమని ఎన్టీఆర్, దర్శకుడ్ని అడిగాడట. అలాగే సెకండ్ హాఫ్ విషయంలో కూడా కొన్ని సూచనలు చేసాడట ఎన్టీఆర్.


Recent Random Post: