జక్కన్న అసహ్యంగా ఉన్నావన్నాడు

ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ఎన్టీఆర్ దూసుకు పోతున్నాడు. రెండవ వారంలో కూడా షో అలా అలా మంచి రేటింగ్ తో అందరిని ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. ప్రస్తుతం షో కు సంబంధించి ఎన్టీఆర్‌ మాట్లాడిన మాటలు తన వ్యక్తిగతం గురించి చేబుతున్న విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా వచ్చిన ఒక కంటెస్టెంట్ తో మాట్లాడుతూ రాజమౌళి తనను అసహ్యంగా ఉన్నారు అంటూ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.

ఒక కంటెస్టెంట్ తన బట్టతల కారణంగా చాలా ఆత్మనూన్యత భావంతో ఉన్నాను అంటూ తెలియజేశాడు. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. తొలి నాళ్లలో చాలా లావుగా ఉండేవాన్ని. ఎప్పుడు కూడా నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కాని మా జక్కన్న రాజమౌళి గారు ఒక సారి నాతో అసహ్యంగా ఉన్నారు అన్నాడు. అప్పుడే మన చుట్టు ఉన్న స్నేహితులు మనకు చక్కని మార్గ నిర్దేశం చేస్తారు. వారే మనకు నిజమైన స్నేహితులు అన్నారు. ఇక నటనలో రాణించాలంటే నిజాయితీగా ఉండాలి అంటూ ఎన్టీఆర్‌ సూచించాడు.


Recent Random Post: