సీనియర్‌ నటిని రూ.4 కోట్లకు మోసం చేశారట

హీరోయిన్ గా వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ లో ఐటెం సాంగ్ ల్లో కనిపించిన జయలలిత ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చిన ఈమె బాగానే సంపాదించిందట. కాని ఒక నిర్మాణ సంస్థ తనను పూర్తిగా మోసం చేసిందని తన వద్ద నుండి రూ.4 కోట్ల రూపాయలు తీసుకుని చేతులు ఎత్తేసింది అంటూ జయలలిత ఆవేదన వ్యక్తం చేసింది. వారు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం మళ్లీ వారు నాకు ఇవ్వడం చేయడంతో నమ్మకం కలిగింది. నమ్మించి అలా నాలుగు కోట్లకు టోపీ పెట్టారంది.

ఒకప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన నేను ఇప్పుడు సొంత కారు లేక క్యాబ్‌ ల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరు పెట్టుకుంది. జయలలిత ఇంకా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అలీతో సరదాగా కార్యక్రమం సందర్బంగా జయలలిత పాల్గొంది. వరలక్ష్మి తో కలిసి జయలలిత ఆలీ షో లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను మోస పోయిన విషయాన్ని షేర్‌ చేసింది. ఈ ఎపిసోడ్‌ వచ్చే వారం ఈ టీవీలో ప్రసారం కాబోతుంది.


Recent Random Post: