‘జబర్దస్త్’ లో నారా లోకేష్ తియ్యగుంది పంచ్ తో రోజా నవ్వులు

తెలుగు బుల్లి తెరపై సంచలన కామెడీ షాగా నిలిచిన జబర్దస్త్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు సినీ ప్రముఖులు మరి కొన్ని సార్లు రాజకీయ ప్రముఖులు ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసేందుకు కమెడియన్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు వివాదాస్పదం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా నారా లోకేష్ ను ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ లో చేసిన కామెడీ తో రోజా తెగ నవ్వేసింది.
నారా లోకేష్ కొన్నాళ్ల క్రితం ఒక చోట సాధారణ బండి వద్ద మజ్జిగ తాగుతూ చక్కెర వేశావ తీయగా ఉంది అన్నాడు. అది ఇప్పటికి కూడా మీమ్స్ అవుతూనే ఉన్నాయి. నిన్నటి జబర్దస్త్ ఎపిసోడ్ లో తాగుబోతు రమేష్ స్కిట్ లో మనం ఇద్దరం కలిస్తే తియ్యగుంటది అన్నప్పుడు రోజా గట్టిగా నవ్వేసింది. లోకేష్ డైలాగ్ గుర్తుకు తెచ్చే విధంగా అది ఉందని అంటున్నారు.


Recent Random Post: