అసోం సీఎంగా హిమంత బిశ్వశర్మ

అసోం ముఖ్యమంత్రి ఎవరనే అంశం తేలిపోయింది. గత కొన్నిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. అసోం ఆర్థికమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మను అసోం కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఖరారు చేసింది. గౌహతిలో ఆదివారం బీజేపీ శాశనసభాపక్ష సమావేశంలో తమ నాయకుడిగా హిమంతను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అసోం కొత్త సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అసోం ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై బీజేపీ అధిష్టానం పలుమార్లు సమావేశాలు నిర్వహించింది.

ప్రస్తుతం సీఎం శర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మ తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో తనకే అవకాశం ఇవ్వాలని హిమంత గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. దీంతో ఆయన్ను సీఎంగా ఖరారు చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రస్తుత సీఎం సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు.


Recent Random Post: