వక్కంతం రెండో సినిమా నితిన్ హీరోగా లాంచ్!

యూత్ స్టార్ నితిన్ తదుపరి చిత్రం `మాచర్ల నియోజక వర్గం`లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా నితిన్ మరో సినిమాకి సైన్ చేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ అయింది.

కొత్త సినిమా పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముహూర్తం షాట్ కు పుస్కర్ రామ్ మోహన్ రావు క్లాప్ కొట్టగా.. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి- ఠాగూర్ మధు స్క్రిప్ట్ ను అందజేశారు.

పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఇక బన్నీతో `నా పేరు సూర్య` తర్వాత కొంత గ్యాప్ తో వక్కంతం వంశీ ఈ సినిమా చేస్తున్నాడు. దమ్మున్నరచయితగా నిరూపించిన అతడు ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకోవాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.


Recent Random Post: