నేచురల్ స్టార్ దృష్టిలో పాన్ ఇండియా అంటే అది!

టాలీవుడ్ నుంచి ప్రధానంగా పాన్ ఇండియా చిత్రాల పరంపర కొనసాగుతోంది. `బాహుబలి` నుంచి ఈ తరహా చిత్రాల దండయాత్ర మొదలైంది. ప్రస్తుతం చాలా చిత్రాలు ఇదే ఫార్ముల నేపథ్యంలో రూపొందుతున్నాయి. కూడా. ఇటీవల విడుదలైన రాథేశ్యామ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవకపోయినా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఆ తరువాత వచ్చిన `ట్రిపుల్ ఆర్` పాన్ ఇండియా వైడ్ గా రికార్డుల మోత మోగించింది. రీసెంట్ గా కన్నడ నుంచి వచ్చిన `కేజీఎఫ్ 2` కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది.

ఇదే కోవలో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మూవీస్ పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాని నటిస్తున్న తాజా చిత్రం `అంటే సుందరానికి`. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని ని నిర్మిస్తున్నారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 10న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నానితో పాటు హీరోయిన్ నజ్రియా నజీమ్ టీమ్ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు పాన్ ఇండియా సినిమా మీ నుంచి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు హీరో నాని ఆసక్తికరంగా స్పందించారు.

పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పడు దేశమంతా మంచి పేరొస్తే .. ఎక్కడెక్కడో వున్న వాళ్లంతా మన తెలుగు సినిమాని చూసి.. ఫోన్ చేసి చాలా బాగుందంటే అది పాన్ ఇండియా కిందే లెక్క. ఇప్పడు `దసరా` సినిమా తెలుగుతో పాటు హిందీ లోనూ విడుదల కానుంది. అంతే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోంది. అయితే ఇండియాలోని ప్రతీ కార్నర్ లో రిలీజ్ అయ్యే సినిమానే నా దృష్టిలో పాన్ ఇండియా సినిమా. ఇప్పడు ప్రతీ సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ ని తగిలించడం నా దీష్టిలో కరెక్ట్ కాదు.

ఎక్కడెక్కడో వున్న ప్రేక్షకులు తెలుగు సినిమా భలే వుందంటరా అని వెతుక్కుని ఓటీటీలో అయినా చేసే లాంటి సినిమాలు చేద్దాం. అవే నిజమైన పాన్ ఇండియా ఫిలింస్ అని నా ఫీలింగ్` అని పాన్ ఇండియా సినిమా అంటే తన దృష్టిలో ఏంటో నిర్మొహమాటంగా క్లారిటీ ఇచ్చేశారు నాని. నాని మాటలు విన్న వాళ్లంతా కేవలం ఐదు భాషల్లో విడుదలైన సినిమాలే పాన్ ఇండియా సినిమాలా? అని చర్చించుకుంటున్నారు.


Recent Random Post: