బేబీ గర్ల్‌ కు జన్మనిచ్చిన తెలుగు బిబి స్టార్‌

బుల్లి తెరపై యాంకర్‌ గా ఎన్నో షో లు చేసి సీరియల్స్ లో కనిపించి సినిమాల్లో కూడా నటించి మెప్పించిన హరితేజ కొన్ని రోజుల క్రితం తాను గర్బవతిని అంటూ అధికారికంగా చెప్పిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో హరితేజ ప్రెగ్నెన్సీ తో ఉన్న వీడియోలు ఫొటోలు సందడి చేశాయి. ఇక శ్రీమంతం కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. సోషల్‌ మీడియాలో హరితేజ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అమ్మాయికి జన్మనిచ్చినట్లుగా హరితేజ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

తన భర్తతో తీసుకున్న ప్రెగ్నెన్సీ ఫొటో షూట్‌ కు చెందిన ఫొటోను షేర్‌ చేసి ఇట్స్ బేబీ గర్ల్‌ అంటూ పేర్కొంది. హరితేజ తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే. ఫైనల్‌ కంటెస్టెంట్‌ గా నిలిచిన హరితేజ అంటే సీజన్‌ 1 కు హోస్టింగ్‌ చేసిన ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం మరియు గౌరవం అనే విషయం తెల్సిందే. హరితేజ బిగ్‌ బాస్‌ లో ఉన్న సమయంలో టాస్క్‌ లో భాగంగా పాడిన బిగ్‌ బాస్ పాట ఇప్పటికి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక సినిమాల్లో ఆమె రెగ్యులర్‌ గా కనిపిస్తూనే ఉంది. గ ఏడాది మహేష్‌ బాబు నటించగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌ సోదరి పాత్రలో కనిపించింది.


Recent Random Post: