కమల్ హాసన్ విలన్ గా `పుష్ప` విలన్

మలయాళంలో అగ్ర కథానాయకుడిగా.. జాతీయ అవార్డ్ గ్రహీతగా సంచలనాలు సృష్టించిన ఫహద్ పాజిల్ కి దేశవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో వేగంగా ఎదిగిన హీరో అతడు. నటుడిగా విలక్షణత అతడి సొంతం. అందుకే ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల్లోనూ అతడి పేరు మార్మోగుతోంది.

ప్రస్తుతం బన్ని నటిస్తున్న పుష్ప చిత్రంలో ఫహద్ క్రూరుడైన విలన్ గా నటిస్తున్నాడు. పుష్పరాజ్ తో అతడి ఢీ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలని టీమ్ ప్రకటించింది. ఇక ఫహద్ తమిళంలోనూ భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. విశ్వనటుడు కమల్ హాసన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నాడని తెలిసింది.

1992 లో విడుదలైన తమిళ క్లాసిక్ హిట్ `తేవర్ మగన్` తెలుగులో క్షత్రియ పుత్రుడు పేరుతో అనువాదమై సక్సెసైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రమిది. ఇందులో కమల్ హాసన్ నటనకు ప్రజలు అభిమానులు జేజేలు పలికారు. భరతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్ రేసులో భారతదేశం తరపున అధికారికంగా ప్రవేశం దక్కించుకుంది. తెలుగు వెర్షన్ క్షత్రియపుత్రుడు ఘనవిజయం సాధించింది. ప్రముఖ తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో అరుదైన చిత్రంగా క్షత్రియపుత్రుడు హిస్టారికల్ రికార్డుల్లో నిలిచింది. మూడు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ తేవర్ మగన్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. కమల్ ఈ మూవీకి స్క్రిప్ట్ రాస్తున్నారు. టేక్ ఆఫ్- సి యు సూన్- మాలిక్ చిత్రాలతో ఫేమస్ అయిన ప్రఖ్యాత మలయాళ దర్శకనిర్మాత మహేశ్ నారాయణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు.

ఇందులో ఫహద్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందిట. కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న `విక్రమ్`లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ కి వెంటనే కమల్ తో మరో ఆఫర్ దక్కడం చర్చకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుంది.

#పుష్ప.. ఈవిల్ ఎప్పుడూ ప్రమాదకరం కాదు

`ఈవిల్ ఎప్పుడూ అంత ప్రమాదకరమైనది కాదు!!“ అంటూ `పుష్ప` నుంచి ఫహద్ ఫాజిల్ లుక్ ని నేడు చిత్రబృందం రిలీజ్ చేసింది. `ఈవిల్ -ఐ`ని ఎంతో క్రూరంగా ఆవిష్కరించిన తీరు భయపెట్టింది. గంధపు చక్కల స్మగ్లర్ అయిన పుష్పరాజ్ ని వెతుకుతూ వచ్చే ఈవిల్ మ్యాన్ గా ఫహద్ ఫాజిల్ కనిపిస్తారా? క్రూరుడైన విలన్ గా అతడి ఆహార్యం ఎలా ఉండనుంది? అన్నది సస్పెన్స్. ఫహద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ని లాంచ్ చేయగా వైరల్ అయ్యింది. గంధపు చెట్టులోంచి చూస్తున్న ఈవిల్ ఐ ఆ పోస్టర్ లో కనిపించింది. అక్కడే ఉంది అసలు ట్విస్టు. చిత్తూరు నేపథ్యంలో లోకల్ యాసతో ఈ సినిమాలో చాలా ట్విస్టులనే సుక్కూ రివీల్ చేయనున్నాడన్న టాక్ ఉంది. పుష్ప 1 ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నా సాధ్యం కాదని టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ కి పుష్ప 1 రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇంకా 40 లో అడుగుపెట్టక ముందే ఫహద్ ఫాజిల్ జాతీయ అవార్డ్ గ్రహీతగా చాలా సాధించాడు. పుష్పతో తన స్టార్ డమ్ ని పాన్ ఇండియా రేంజుకు విస్తరించనున్నాడు. అల్లు అర్జున్ .. కమల్ హాసన్ లతో పాటు మరో ఇద్దరు పెద్ద స్టార్ల సినిమాల్లోనూ కీలక పాత్రల్లో ఫహద్ కి ఆఫర్లు దక్కనున్నాయని తెలిసింది.


Recent Random Post: