ఈటెల మాటల ఉద్దేశ్యం ఏంటబ్బా..!

వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈమద్య కాలంలో మాట్లాడుతున్న మాటలు ఎవ్వరికి అర్థం కాకుండా ఉన్నాయి. దాంతో ఆయన మాటలకు రకరకాలుగా అర్థాలను వెదుక్కుంటున్నారు. ఆమద్య సీఎం కేసీఆర్‌ తీరును తప్పుబట్టినట్లుగా ఈటెల మాట్లాడాడు అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన వరంగల్ లో మాట్లాడుతూ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో రాజకీయం అంటే ఒక రకంగా చూసే రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాత్కాలిక విజయాల కోసం నాయకులు తమ గౌరవంను పక్కన పెడుతున్నారు. ప్రజల్లో గౌరవం కోల్పోతున్నారు. ఒకప్పుడు నాయకులు అంటే ప్రజల్లో మంచి గౌరవంను కలిగి ఉండే వారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాయకులు మరియు కార్యకర్తల మద్య సంబంధాలు కూడా దెబ్బ తింటున్నాయని అన్నారు. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్ నాయకులపై చేస్తున్న విమర్శలను కూడా ఈటెల తప్పుబట్టాడు. రాజకీయ నాయకులు ఒకప్పుడు సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేసే వారు. కాని ఇప్పుడు అలా కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈటెల చేసిన ఈ వాఖ్యలు ఎవరి గురించి అయ్యి ఉంటుందని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.


Recent Random Post: